*- విజయవాడలోని సెర్ఫ్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి డిఆర్‌డిఎ పిడిల సమీక్షా సమావేశం.*
*- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెర్ఫ్ సిఇఓ రాజాబాబు.*
*- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్...*
*- డిఆర్డిఎ పిడిలు ప్రతినెలా 15 రోజుల పాటు ఫీల్డ్ లో పనిచేయాలి.*
*- గ్రామీణాభివృద్ది కోసం కేటాయించిన పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలి.*
*- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హలకు అందేలా చర్యలు తీసుకోవాలి.*
*- వచ్చే జనవరి నుంచి అదనంగా 7 లక్షల మందికి వైఎస్‌ఆర్ పెన్షన్లు.*
*- పెన్షన్ల ఎంపికలో గ్రామసచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల తో సమన్వయం చేసుకోవాలి.*
*- ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం.*
*- పొదుపు సంఘాలు చెల్లించాల్సిన రుణాలను నాలుగు విడతలుగా వారి చేతికే అందిస్తాం.*
*- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని ప్రారంభిస్తాం.*
*- ప్రజాసంకల్ప పాదయాత్రలో శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తెస్తున్నాం.*
*- రాష్ట్రంలోని 9.33 లక్షల పొదుపు సంఘాలు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన రుణం రూ. 27,168 కోట్లు.*
*- ఈ రుణభారం నుంచి పొదుపు మహిళలను విముక్తి చేస్తాం.*
*- ఈ రుణాలకు గానూ ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీలోగా బ్యాంకులకు మహిళలు చెల్లించాల్సిన వడ్డీ రూ.1,823 కోట్లు.*
*- ఈ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించేందుకు సిద్దం.*
*- మొదటి అయిదు నెలల వడ్డీ కింద రూ. 760 కోట్లు నేరుగా రుణ ఖాతాలకు జమ చేస్తాం.*
*- సున్నావడ్డీ కింద రూ.5 లక్షల రూపాయలకు లోబడి రుణాలు.*
*- ఈ వడ్డీని పొదుపు సంఘాల తరుఫున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లింపు.*
*- స్త్రీనిధి కింద ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులను రూ.900 కోట్లు నుంచి రూ.1800 కోట్లకు పెంపు.*
*- స్త్రీ నిధి కింద ఇచ్చే ఆర్థిక తోడ్పాటును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు.*
*- 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు మొదటిసారిగా ఆఫీస్ సదుపాయం.*
*- రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు 76 గోడవున్ లతో కూడిన ఇన్ పుట్ షాప్‌ల ఏర్పాటుకు నిర్ణయం.*
*- రైతు సంస్థలే స్వయంగా నిర్వహించుకునేలా 92 ఉత్పత్తి ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం.*
*- ఎఫ్ పి ఓల ద్వారా తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను రైతులకు అందించేందుకు రూ.33 కోట్లు విడుదల.*
*- ప్రతినెలా 5వ తేదీన వైఎస్‌ఆర్ పెన్షన్లను అందించాలి.*
*- వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ.*
*- అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలి.*
*- గ్రామస్థాయిలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా నవరత్నాలు సక్రమంగా అందేలా పిడిలు, సెర్ఫ్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలి.*